చాలా రోజుల నుండి 'దళితవాదం' అంటే ఏమిటనే సందేహం ఉంది. అసలు దళితవాదం పూర్వాపరాలేమిటి? అసలు అది ఏ రకమైన దృక్పధం? ఈ వాదనకి ఆద్యులు ఎవరు? ఇలా చాలానే సందేహాలు ఉన్నాయి.
శీర్షికను కూడా మొదటివాక్యంలో వివరించిన అర్ధంలోనే వ్రాయటం జరిగింది కానీ, సహజార్ధంలో కాదని గ్రహించమని మనవి.
ఒకప్పుడు హరిజన, గిరిజన, తదితర నిమ్నజాతులకు చెందిన ప్రజలపై ఉన్న ఆంక్షలపై కత్తులు దూసి, వారికి సరికొత్త ఆకాంక్షలు రేకెత్తించి, భారత జనజీవనస్రవంతిలో వీరూ భాగమేనని ఉద్ఘాటించి, తదనుగుణంగా పోరాటాన్ని సాగించినవారిలో చాలామంది అగ్రకులాలవారే.
ఆనాటి నాయకుల లక్ష్యమల్లా, నిమ్నజాతివారికి సమాజంలో సమానస్థాయి కల్పించటమే. ఊళ్ళల్లో, గుళ్ళల్లో, బళ్ళల్లో వారి ప్రవేశానికి పోరాడటం, వయోజనవిద్య తదితర మార్గాల ద్వారా వారికి సమానస్థాయి కల్పించటానికి తోడ్పడ్డారు. అప్పటి ఆ నాయకుల నిజాయితీ, నిబద్ధత ఏనాడు ప్రశ్నార్ధకం కాలేదు. ఆనాటి ఆ నేతల పోరాటంలో 'దళిత' అనే పదప్రయోగం జరిగిందో లేదో తెలియదు. కానీ, ఆ పోరాటాన్ని మాత్రమే నిజమైన దళిత ఉద్యమంగా పేర్కొనవచ్చు.
ఆ తర్వాతి పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి. కాలక్రమేణా, అగ్రకులాల నుంచే దళితవాదులమనే కుహానా నాయకులు పుట్టుకొచ్చారు. దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులను భ్రష్టుపట్టించేవిధంగా ఓటుబ్యాంకు రాజకీయాలను ప్రారంభించారు. కొన్నాళ్ళు వీరు దళితులను బాగానే మోసపుచ్చగలిగారు.
మళ్ళీ పరిస్థితులు మారాయి. దళితుల నుంచే మలితరం నేతలు పుట్టుకొచ్చారు. మోసపోతున్నామని గ్రహించిన ఈ నేతలు దళిత ఉద్యమాన్ని వారి వారి వ్యక్తిగత కీర్తిప్రతిష్టల కోసం వాడుకోవటం మొదలుపెట్టారు.
వీరికైనా ఏమాత్రమూ నిబద్ధత లేదు. అధికారమే పరమావధిగా వీరి పరిపాలన కొనసాగుతున్నది. తమను (తనను) పదవిలో అధిష్టింపచేయటం వలన మాత్రమే, దళిత జనోద్ధరణ జరుగుతుందని నమ్మబలికే ఈ నేతలు విగ్రహాలు స్థాపించుకోవటంలో చూపే చొరవ దళితోద్ధరణలో ఏమాత్రమూ చూపటంలేదు.
నిజమైన సమసమాజస్థాపన కోసం మొదటితరం నాయకులు ఆరంభించిన ఈ ఉద్యమం కాలక్రమంలో అడ్డదారులు తొక్కడం మొదలయ్యింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ ఉద్యమం అలా అడ్డదారులు తొక్కటానికి సో కాల్డ్ దళితులే కారణం. అది ఎలా జరిగిందనేది ఓసారి గమనిద్దాం.
నిమ్నజనోద్ధరణకుగాను, వారికి ఆలయప్రవేశాలు కల్పించటం, ఊళ్ళల్లోనూ బడుల్లోనూ వారికి ప్రవేశం కల్పించటమనే దిశగా మహాత్మాగాంధి తదితర నేతల పోరాటం జరిగితే, దీనికి కాంట్రాస్టింగుగా మహాదళితనేతగా పేర్కొనబడుతున్న డా. అంబేద్కర్, మతమార్పిడివల్లనే నిమ్నజనోద్ధరణ జరుగుతుందని భావించటమే కాకుండా ఆచరించి మరీ చూపారు. మతమార్పిడి మాత్రమే కాకుండా, హిందూమతం మీద బురదజల్లటం ద్వారా 'కసి' తీర్చుకునే అవకాశాన్ని కూడా ఆయనే కల్పించారు, పాటించారు కూడా. సరిగ్గా, ఇక్కడే దళిత ఉద్యమ పోరాటం గతి తప్పింది.
అలానే, శతాబ్దాలుగా అణగారిన నిమ్నజాతివారి కోసం రాజ్యాంగసభ 'రిజర్వేషన్లు' ప్రతిపాదిస్తే, కేవలం పది సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు అమలు జరగాలని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. శతాబ్దాలుగా అణగారిన కోట్లాది జనాలని పది సంవత్సరాల్లోనే సమానస్థాయికి తీసుకురాగలమని అంబేద్కర్ ఎలా అభిప్రాయపడ్డారో ఆలోచనకేమాత్రమూ అందదు. అదేవిధంగా, ఈ రిజర్వేషన్లను తదనంతరకాలంలో 'రాజకీయసాకు'గా వాడుకోగల రాజకీయ నాయకులు పుడతారని మన రాజ్యాంగసభ కూడా ఏమాత్రమూ ఊహించలేకపోవటమూ మరో విచిత్రమే.
తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్న నేతల సారధ్యంలో దళిత ఉద్యమం ఎలా సాగిలబడిందో, ఎలా అపఖ్యాతులు మూటగట్టుకుంటున్నదో మనందరికీ తెలిసిందే.
రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కులు ఉపయోగించుకొని, ఈనాడు సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న 'దళిత వ్యక్తులు' కూడా ఆ హక్కులను ఎలా దుర్వినియోగం చేయగలమో ప్రదర్శిస్తున్నారు కానీ, ఇంకా అణగారిన బతుకులతో జీవితాలు తెల్లవారుస్తున్న అనేకానేక దళితులను మాత్రం పట్టించుకోరు. ఏ సభలోనో, సమావేశంలోనో, సాహిత్యంలోనో, ఇంటర్నేట్ లోనో వారిని అవమానించారని కేసులు పెడతామంటారే కానీ దళితజనోద్ధరణకు వాళ్ళేం చేస్తున్నరనేది మాత్రం వారికి పట్టదు. ఇది ఓ రకం.
దేశంలోనే అత్యున్నతపదవులు అధిష్టించినా తమ బిడ్డల కోసం రిజర్వేషనులు ఉపయోగించుకునే వ్యక్తులు మరో రకం. రిజర్వేషను ఏమాత్రమూ అవసరంలేని వీరు, మరో దళితవ్యక్తికి రావలసిన అవకాశాన్ని లాక్కుంటున్నామని గ్రహించరు.
వేలకోట్ల రూపాయలతో తన విగ్రహాలు, తన పార్టీ గుర్తుగా ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసే మాయవతులు ఓ పక్కన ఉంటే, లోన్లు ఇవ్వటంలేదనే నెపంతో బ్యాంకు మేనెజర్లను, ఇతర ప్రభుత్వాధికారులను చేయి చేసుకునే జగన్నాధాలు మరోవైపున ఇదే దళితజనోద్ధరణగా మభ్యపెడుతున్నారు.
ఇతరులకు 'కులవివక్ష' అంటగట్టే ప్రబుద్ధులు, కులదూషణలు చేస్తూ అదే దళితవాదమని ఇతరులను భ్రమింపచేస్తున్నారు. మంద కృష్ణ మాదిగను ఎవరైనా విమర్శిస్తే, అది తనను కాదని, తన కులాన్ని దూషించారని ఆయన ప్రచారం చేస్తారు. ఇక్కడ ఇంటర్నెట్టులో 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అంటూ కులదూషణ చేసే వ్యక్తి, తాను చేసింది కులదూషణ అని ఒప్పుకోడు.
ఈ పైత్యం ఎంతలా పెరిగిందంటే, నువ్వు వ్రాసింది కవిత్వం కాదు అన్నందుకు, దళితుడు వ్రాసింది కవిత్వం కాదంటావా అని తన్నటానికో, అట్రాసిటీ కేసు పెట్టటానికో కూడా తయారయ్యే ప్రబుద్ధులు బయలుదేరుతున్నారు.
మరి ఈ వ్యక్తులే, పద్య కవిత్వం సాహిత్యమే కాదు పొమ్మంటారు. అప్పటివరకూ కుల ప్రస్తావన ఏమాత్రమూ జరగని శ్రీశ్రీలు, గురజాడలని అగ్రవర్ణ కవులుగా ప్రచారం చేస్తారు. నన్నయ, శ్రీనాధ తదితర కవిసార్వభౌములు గడ్డిపోచలని తీసిపారేస్తారు. వీరి లెక్క ప్రకారం తెలుగు సాహిత్యాన్ని కత్తి పద్మారావు గారితోనో, లేదంటే మరో 'కత్తి'వారితోనో మొదలేయాల్సి ఉంటుందేమో!
ఇటువంటి నీచమైన నేపధ్యంలో, నిజమైన దళితవాదం కూడా అపవాదులు ఎదుర్కొంటున్నది. నిజానికి, నిజమైన దళితజనోద్ధరణమనే ఉద్యమం ఏనాడో చచ్చిపోయింది. కాగా, దళితము, దళితమూ అనే వ్యర్ధవాదనలతో, వ్యర్ధ సాహిత్యాలతో కుహానావాదులు పబ్బం గడుపుకుంటూనే ఉన్నారు.
Friday, July 3, 2009
దళితవాదము - ఒక 'సుదీర్ఘ' శంక
Posted by
కొండముది సాయికిరణ్ కుమార్
at
10:18 AM
Subscribe to:
Post Comments (Atom)





17 comments:
మీరు చెప్పింది నిజం. ఈ బేధాలు తగ్గుముఖం పడుతున్న దశలో వీరి వ్యాఖ్యలు చర్యలు రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి.
Somehow I feel the name "Dalit" (oppressed) itself gives a kind of inferiority complex and makes them remember that their ancestors did not live a decent life, resulting them to feel angry and frustrated with rest of the society. Most of them carry these feelings even if they are rich and educated.
The name given by Gandhiji was really good "HariJan" It makes them more privileged, direct sons of GOD. Not sure why they prefer first one.
Similarly "GiriJan" simply means their ancestors lived happily and freely on hilltops.
Well said Sai Kiran.
సాయి కిరణ్ గారు,
మీ విశ్లేషణ చాలా చక్కగా, వాస్తవాలను ప్రతిబింబించేలా ఉంది.మంచి పోస్ట్
క్రితం సారి వారిని టాప్ 50 దళిత మేధావుల పేర్లు చెప్పమన్నాను. వారు 60సం||స్వాతంత్రం తరువాత ఇద్దరి పేర్లు రాశాడు. దీనిని బట్టి మనం అర్థము చేసు కోవచ్చు వారు చెపె మాటల గురించి. బొల్లొజు) గారు ఇప్పటి వరకు ఎక్కడా వారు తయారు చేసిన స్క్రీన్ షాట్ల గురించి పెదవి మెదపలేదు. వారు చాలా విభిన్నం గా రాస్తారంటా ఈయన కితాబు. ఇటువంటి వారికి బి.జు. బాబా గారు వకల్తా తీసుకోని మాట్లాడుతారు.
అయ్యా అనామకా
నువ్వు నన్ను వదలవా?
నేను చెప్పదలుచుకొన్న విషయాలను చెప్పేసాను.
ఇక స్క్రీన్ షాట్ల గురించి నాకు టెక్నికల్ డిటైల్స్ తెలియవు. ఒక వేళ అవి టేంపర్డ్ వి అయితే అలా చేయటం తప్పు, కాక నిజమైనవే అయితే నువ్వు ఇలా పదేపదే ప్రస్తావించటం తప్పు.
ఇంతకు మించి నేనేం కామెంటగలను వాటిపై.
తాడేపల్లి గారి బ్లాగులో ఒకసారి దళితులపై, వెనుకబడిన వర్గాలపై, బ్రాహ్మణులపై నా అభిప్రాయాలను స్పష్టంగా ఒక కామెంటులో చెప్పాను. ఇప్పటికీ నా అభిప్రాయాలు అవే. వీలైతే చూసుకోండి.
బొల్లోజు బాబా
Kiran garu
well said sir
Your analyses is very apt and to the point.
SC/STs are mear votes ( only numbers )in their own leaders hands.
They blame the others, who really helped them, for their vows.
As long anyone claims reservations, they'll be untuochbles in one way or other.
you are right
can you imagine what would have happened
if a forward MP had slapped a Dalit bank officer?
Could you please write a piece on that?
బ్లాగులోకంలో ఈ గొడవలు, గందరగోళాలు లేని రోజులలో నేను తాడేపల్లిగారి బ్లాగులో అక్కడ చేసిన కామెంటు ఇదీ
....... ఇక ఈ సమస్యపై నా అభిప్రాయాలు
బ్రాహ్మణుల గతకీర్తిపై నాకు ఫాసినేషను. హిందూదేశము ఉన్నతమైన సంస్కృతిని సాంప్రదాయాలనీ కలిగిఉన్నందుకు ఒకనాటి బ్రాహ్మణ మేధే కారణమని నమ్ముతున్నాను. అక్కడక్కడా కొన్ని లోటుపాట్లున్నా అవి విస్మరింపదగ్గవి. (ఇది సన్నాయి నొక్కుగా భావించరాదు. అవగాహనతో అంటున్న మాటే)
వారి ప్రస్తుత పరిస్థితులపై నాకు కంపాషను.
ప్రస్తుత సమాజంలో కులవృత్తుల చిధ్రం కావటం పట్ల ఆవేదన. నిస్సహాయత.
రిజర్వేషన్లు కొన్ని మార్పులతో (రెండవ మూడవతరం లబ్ధిదారులకు దక్కకూడదు) అమలుచేయటం అవసరమనే నా అభిప్రాయం
ఇక రాజకీయాలు మూడునాలుగు కులాలకు తప్ప మిగిలిన కులాలకు ఒరగపెట్టిందేమీ లేదన్నది ఇప్పటిదాకా నే గ్రహించిన అనుభవం
నా ఆలోచనలు కానీ రాతలు కానీ పై అభిప్రాయాలకు అనుగుణంగానే ఉన్నాయని ఉంటాయని విశ్వసిస్తున్నాను. ఇవి నానిశ్చితాభిప్రాయాలు. ఎవరెన్ని ప్రతివాదనలు చేసినా మార్చుకోవాల్సిన అవసరంలేదు. అట్టి అనుభవాలు ఎదురైతే స్వీయసమీక్ష చేసుకొంటాను. .........
భవదీయుడు
బొల్లోజు బాబా
నన్ను ఇది వరలో ఒకటి రెండు సార్లు ఎవరో కానీ అడిగారు. ఏదైనా ఒకవిషయంపై కామెంటు చేసినపుడు, ఇప్పుడిలా మాట్లాడుతున్నావు, మరి అప్పుడు కళ్లు మూసుకుపోయిఉన్నావా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదూ, లేక ఖండించలేదూ అని. చాలా సందర్భాలలో వారు ఉదహరించిన విషయాలను నేను చదవనేలేదు. అప్పటికే చదివి ఉండినా ఎవరి అభిప్రాయాలు వారివి అని అనుకొని ఊరుకొన్నవి కొన్ని.
అలా ప్రశ్నించే వారు ఒకవిషయాన్ని మనసులో పెట్టుకోవాలి, మీరు చూసిన కోణంలోనే అందరూ చూడాలని రూలేమీ ఉండదు, లేదా అలా ఆశించరాదేమో కూడా.
ఒక వ్యక్తిపై మన శక్తియుక్తులను, మేధను వెచ్చించటం వృధా అనే నేను భావిస్తాను. ఇప్పటి పోస్టుకు వచ్చినట్లయితే దీర్ఘశంక అన్న పేరుతప్ప టపా లో అంశాలు ఒక వాదాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఒక వాదం ఈ అంతర్జాల పుటలలో భవిష్యత్ తరాలకోసం నిక్షిప్తమైపోయింది. అది ఎంతమేరకు సత్యం లేదా సత్యదూరం అనేది కాలం నిర్ణయిస్తుంది.
బొల్లోజు బాబా
Post is simply superb!!
Correct, now a days, I have seen the word "Brahmanical Attitude" more frequently. I don't what does mean :-( ?
కిరణ్ గారూ -
నేనూ ఇలా రాద్దాం అనుకున్నా. ఈలోగా మీరే రాసారు.
ఒకవిషయం ఇక్కడ ప్రస్తావిద్దాం అనుకుంటున్నా. దానిమీద ఓ పోస్టే రాయచ్చు, కానీ వృధా.
ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు. చాలా ఉద్దాత్తరూపుడు. ఉదారస్వభావుడూ. యోగి. ఋషి. పల్నాటి వీరుడు. వేదసంహితుడు. ఇంకా ఎన్నెన్నో.
ఒక్కసారి చూద్దాం.
నేను పోనీ ఇదేమైనా కవితా అని జూన్ 15 న ఓ పోస్టు వేసాను.
http://ramakantharao.blogspot.com/2009/06/blog-post_15.html
ఆయన రాసిన కవితో కాకరకాయో జూన్ 19న వేసారు.
ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు.
ఇది ఎంత ఫన్నీగా ఉందో చూడండి.
ఏమైనా ఇలాంటి మేధోసంపత్తులు నిజమైన మేధావులైతే నేటి రిజర్వేషన్ సిస్టం లోని లోటుపాట్లని ఎత్తిచూపి, జనాలు రక్తంతో తడిసిముద్దైన పన్ను డబ్బుతో అందించే రిజర్వేషన్ ఫలాలని సరిగ్గా వినియోగం అయ్యేలా చేస్తారు.
నేను అమెరికాకి రాకముందుదాకా - కొన్ని కొన్ని రోజులు పద్దెనిమిది గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. పెళ్ళాం ఇంట్లో కడుపుతో ఒక్కతే ఉంటే నేను పనిలో. ఇలా చమటోడ్చి ఎన్నో త్యాగాలు చేసి సంపాదించిన ధనాన్ని ప్రభుత్వం "పన్ను" రూపంలో నిర్ధాక్షిణ్యంగా లాక్కుని, ఇలాంటి కుహానా మేధావులకి ఉచితంగా తిండి కూడు గుడ్డ సర్వ వసతులూ పొందుపరిస్తే, వీరు సిగ్మండ్ ఫ్రూఎడ్ అని సైకో ఎనాల్సిస్ అనీ, తల్లిని ఆదృస్టితో చూడొచ్చనీ చెప్పే సిద్ధాంతాలను ఉదహరిస్తారు. పైగా అది ఒక టూల్ అని చెప్తారు.
ఎలాంటీ టూల్స్ ఎక్కడ వాడాలి?
ఈరోజున మన జీవితాల్ని ఇంటర్నెట్ ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి.
గూగుల్లో ఇలా కొట్టండి -
"psyco analysis in litarary criticism"
మొట్టమొదట వచ్చేది http://en.wikipedia.org/wiki/Psychoanalytic_literary_criticism
సిగ్మండ్ ఫ్రూఎడ్
ఎక్కడి సాహిత్యం? ఎక్కడి సాధికారత? ఎక్కడి ప్రపంచం? ఏ టూల్స్ని ఎక్కడ వాడాలి?
వికిపీడియా అనేది భారతదేశపు సంఘ సామాజిక ఆర్ధిక పరీస్థితులని ప్రతిబింబిస్తుందా?
జనాలకి ఇవేమీ పట్టవు. వారికి మసాలా కావాలి. కొత్త కొత్త "రహస్య కుతి" అనుభవించే పాఠాలు కావాలి. అందుకోసం వారు ఇలాంటి మేధావుల చూరుకిందకి చేరి చప్పట్లు కొట్టి తమని తామే మోసగించుకుంటారు.
" దీర్ఘశంక అన్న పేరుతప్ప టపా లో అంశాలు ఒక వాదాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. " అన్నారు బాబా గారు. మరి బాబా మీరు కేవలం, కేవలం, ఒక వాదాన్ని తప్ప, ఇంకో వాదాన్ని సమర్ధిస్తూ ఇప్పటికి వరకూ ఎక్కడయినా కామెంట్ వేసారా? screen shots వచ్చే వరకూ technical details తెలియవు అంటారు, మరి మిగతా విషయాలలో అసలు ఆ విషయాలు నేను చదవనే లేదు అంటారు. మరి కాని, ఒ మె"తా"వి ని సమర్ధించటానికి మాత్రం, ఇలాంటి షరతులు ఏమీ గుర్తుకు రావు కదా, మంద జగన్నాధం కొడతానికి షరతులు గుర్తుకు రాకుండా, క్షమాపణలు చెప్పటానికి మాత్రం షరతులు గుర్తుకువచ్చినట్లు!!
"మీరు చూసిన కోణంలోనే అందరూ చూడాలని రూలేమీ ఉండదు, లేదా అలా ఆశించరాదేమో కూడా." అన్నారు ఆ ముక్క మాత్రం నిజమే,
కాకపోతే, అలా చూడటం లేదని, హిందు అన్న ప్రతిదానిని, కించపరచాలని చూస్తూ, తను చూస్తున్న కోణం లోనే జనాలు చూడాలి, ఒక వేల ఏమైన పైకి చూస్తుంటే (మన సాంప్రదాయాల గురించి కాని, మన భవిషత్తు గురిచి కాని), అది తప్పు, నేల చూపులు చూస్తూ, మనలను మనం ప్రత్యక్షం గానో, పరోక్షం గానో కించపరుచుకుంటూ, పరాయి మతాలను మాత్రం, తెల్లాడు పోసిన ----- మాత్రం నెత్తిన తెలివిగా (కనిపించకుండా) జల్లుకుంటూ ఉండాలి, అది కాదూ, కూడదు అంటే, అట్రాసిటీ కేసులు పెడతాం అనుకొనేవాళ్ళు, వాళ్లకు భజన చేసే వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముక్క మాత్రం మరీ చెప్పారు.
రెడ్ ఇంక్ తో అండర్లైన్ చేసుకొని అప్పుడప్పుడూ మీరు కూడా ఈ ముక్క చుస్తూ ఉంటే బాగుంటుందేమో కదా!!!
బాబా గారు, థాంక్స్ ఫర్ యుర్ రిప్లై.
*ఒక వేళ అవి టేంపర్డ్ వి అయితే అలా చేయటం తప్పు, కాక నిజమైనవే అయితే నువ్వు ఇలా పదేపదే ప్రస్తావించటం తప్పు. *
నాకు అది టేంపర్డ్ కాదా అని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నది. ఎందుకంటె అటువంటి గొడవ బ్లాగుల్లో ఎప్పుడు జరగలేదు కనుక. కాని చెప్పే వారెవరు మనకి? వారె చెప్పాలి నిజాన్ని. స్క్రీన్ షాట్ల ని చూస్తె మనకి ఖచ్చితం గా అవి టాంపర్డ్ చేశారని స్పష్టమౌతుంది. కనుక నిజానిజాల్ని మీలాంటి వారు పూనుకొని అందరికి తెలియ జేస్తె చాలా బాగుంటుంది.
*ఒక వ్యక్తిపై మన శక్తియుక్తులను, మేధను వెచ్చించటం వృధా అనే నేను భావిస్తాను*
నేను కూడా మీతో ఎకిభవిస్తాను, కాని కొందరికి నిద్ర లేచిన మొదలు బ్లాగు లో హిందు/బ్రహ్మణ అన్న పదాలు కనిపిస్తే గంగ వెర్రులెత్తి తర తరాలుగా అనగ తొకారంటూ అని మొదలు పెడతారు. ఒకసారి కాక పొయిన ఇంకొకసారి కోపం వస్తుంది ఎవ్వరికైనా. గూర్ఖా వాడు కాలనిలో రాత్రిపూట ప్రతి ఇంటి దగ్గర కర్ర తో కొడుతు చప్పుడు చేసిన్నట్టుగా, కూడలి ఎవ్వరైనా టపా రాస్తె అక్కడ వారు ఒక వ్యాఖ్య రాసి కలకలం లేపుతారు. నాకు తెలిక అడుగుతాను ఈ బ్లాగ్ లో నిరంతర చర్చల వలన వీరికి వచ్చే లాభం ఎమిటి? బ్లాగర్ల raatala వలన సమాజం మారుతుందా?
*ఇప్పటి పోస్టుకు వచ్చినట్లయితే దీర్ఘశంక అన్న పేరుతప్ప టపా లో అంశాలు ఒక వాదాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఒక వాదం ఈ అంతర్జాల పుటలలో భవిష్యత్ తరాలకోసం నిక్షిప్తమైపోయింది. అది ఎంతమేరకు సత్యం లేదా సత్యదూరం అనేది కాలం నిర్ణయిస్తుంది.*
బాబా గారు మి పై వ్యఖ్యా నాకు సాయి గారి వాదన తప్పు అనే విధంగా ఉంది. ఇది ఎంతమేరకు సత్యం లేదా సత్యదూరం అనేది కాలం నిర్ణయిస్తుంది అనడం లో. కాలం ఎప్పుడొ నిర్ణ ఇంచేది ఎమిటి వర్తమానం లోనె నిర్ణయం జరిగింది. ఇక్కడ నిర్ణయిచటానికి కాలం అవసర్మ లేదు సార్, చెంపపట్టి కొట్టిన యం.పి. క్షమాపణలు చేప్పారు, మాయావతి గారి వాదనను సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది. I belive in supreme court.
చాలా బాగుంది. గతాన్ని వదిలేస్తే ప్రస్తుత సమాజంలో దళితులు ఇతర దళిత నాయకులచే, రాజకీయ నాయకులచే ఎక్కువగా exploit చేయబడుతున్నారు.
*బ్లాగులోకంలో ఈ గొడవలు, గందరగోళాలు లేని రోజులలో* దీనికి ప్రధాన కారనం వారే.
*ఒక వ్యక్తిపై మన శక్తియుక్తులను, మేధను వెచ్చించటం వృధా అనే నేను భావిస్తాను. *
ఒక విషయం చదివితే మనకు జ్ఞానం అభివృద్ది చెందాలి అంతె గాని రెచ్చ గొట్టె విధం గా నెల కి 4 టపాలు రాస్తూ ఉండె వారి బ్లాగు చదవటం,మేధను వెచ్చించటం వృధా అనే నేను కూడా మిలాగే భావిస్తాను. వారి బ్లాగును క్లిక్ చేయటం కూడా మానేశాను.
ఎదో అప్పుడప్పుడు మీలాంటి నలుగురిని ఆకట్టు కోవటానికి ఒక రెండు టపాలు రాసినంత మాత్రనా ఆయన చాలా విభిన్న వాదనలను వినిపిస్తారు మిగతా బ్లాగ్ల వారు వీరిని విమర్శిస్తూ సమయం వృధా చేసు కొంట్టున్నారు అని రాసారు. మిగతావారు మంచి టపాలు రాయరు అనే విధం గా మాట్లాడతం సరి కాదు. మీరు కూడలి ని ఒకసారి గmaనిస్తె సైన్స్ మీద డా || శ్రీనివాస్ చక్రవర్తి అనే ఆయనే చాలా అద్భుతమైన విషయాలను రాస్తున్నారు, ఇంకా డా|| వేమురి రావు, ఎకనామిక్స్ మీద అరిపిరాలా, సాహిత్యం మీద చలా ఉన్నాయి.
నేను చెప్పదలచుకొన్నవి చెప్పేసాను.
ఇంక చెప్పటానికేమీ లేవు. చర్చను పొడిగించాలన్న ఉద్దేశ్యాలు నాకు లేవు.
నేనన్న ఒక వ్యక్తి అన్న మాట ఉద్దేశ్యం వ్యక్తిగత దాడులని.
కాలం నిర్ణయిస్తుంది అన్న మాట అనుచితంగా అనిపిస్తే చదువరులు నిర్ణయించుకొంటారు అని చదువుకోగలరు.
థాంక్యూ. ప్లీజ్ లీవ్ మి. i am tired of all this stuff. (sincerely)
bollOJu baba
బాబా గారు,
చర్చను పొడిగించాలన్న ఉద్దేశ్యాలు నాకు లేదు. మిమ్మల్ని రెండు సూటి ప్రశ్నలు అడిగితెనే మీరు నేను అలిసి పోయాను అని సమాధానం ఇచ్చారు. కాని సంసవత్సరాల నుంచి ఎన్ని మార్లు జావబిచ్చినా పదే పదే అదే పనిగా దాడులకు దిగే వారికి ఓపిక గా సమాధనాలు మీరు ఇవ్వలి అనుకోవడం భావ్యం కాదు కదా. వారి తో బ్లాగులో చర్చించె వారు ఎమీ కొత్త వారు కాదు, ఆ టపాకు మాత్రమే తగిన విధముగా స్పందించటానికి. వారు వేల సంవత్సరాల చరిత్ర ను చర్చకు పేట్టి ఒక వర్గం వారిని నిరంతరం ఆక్షేపించటం మా 30 సం|| చిన్న జీవితం ఎవరో పూర్వికులు చేసిన దానికి మమల్ని భాధ్యత వహించమనటం హాస్యస్పదమైన విషయం. ఆ వర్గాలకు అన్యాయం జరిగిందనే గదా ప్రభుత్వం వారు వారికి ప్రత్యెక సౌకర్యాలు కలిపించినది. దానిని ఉపయోగించు కొని అభివృద్ది చెందకుండా రాజ్యధికారం కొరకు పుస్తకాలు రాయడం ఇతరులను ఆక్షేపించటం ఒక వృత్తి అయ్యింది కొందరికి. కనుకనే 50 మంది మేధావుల పేర్లు అడిగితే ఇద్దరి పేర్లు రాశారు వారు బాబా సాహెబ్, రెండవ వారు చంద్రభాను ప్రసాద్. వీరికి మాజి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పేరు గుర్తుకు రాలేదో అందరూ ఆలోచించ వలసిన విషయం.
I am sorry if my words disturbs you.
Post a Comment
Comments