అలుపొచ్చినా రాకపోయినా, అయ్యవారి బెకబెకలు మాత్రం ఆగవు. ఇప్పుడు ప్రజల (హిందువుల అని చదువుకోండి) ద్వంద్వ ప్రవృత్తి గురించి ఇలా సెలవిచ్చారు.
మతానికి అనుకూలమైన సలహాలూ,ప్రతిపాదనలు ఎంత అనౌచిత్యంగా ఉన్నా మనలో చాలా మంది అంగీకరిస్తాం. కానీ వ్యతిరేకంగా తార్కికంగా ప్రశ్నిస్తే మాత్రం మనోభావాలు గాయపరుచుకుంటాం...ఇంతేగా! ఈ ద్వంద్వప్రవృత్తి ఎందుకు?
ఇంతకి ఆ అనౌచిత్యమైన సలహా ఏమిటంటే, ఎవరో బ్లాగరు ఆస్ట్రేలియాలో జరుగుతున్న అరాచకాన్ని తప్పించుకోటానికి ఆంజనేయస్వామి రక్ష కట్టుకోమని చెప్పారట. నేను వేసే కుప్పిగంతులకు నన్ను తిడతారు, మరి అనౌచిత్యంగాసలహాలిచ్చిన ఈ బ్లాగరును ఎవరూ ఏమీ ఎందుకు అనరు అని భోరుభోరుమని ఏడ్చినంత పని చేసేసారీ అయ్యవారు.
అసలు ద్వంద్వ ప్రమాణాల గురించి ఈ అయ్యవారు వాపోవటమేమిటి ఛండాలంగా? తన ఈ ద్వంద్వ ప్రవృత్తినే ఘనంగా వైరుధ్యమని' చాటుకున్నారుగా.
ఎందుకూ పనికిరాని మంత్రాలని ఏదో వ్యాసంలో వ్రాసారు. వ్రాసినాయన ఊరుకున్నారా, లేదే. ప్రతి మంత్రానికి ఉన్నఅర్ధాన్ని అడుక్కుని మరీ పెళ్ళి చేసుకున్నారట. ఎందుకూ పనికిరాని, అర్ధంపర్ధంలేని మంత్రాలతో పెళ్ళి మాత్రం ఎందుకు చేసుకున్నావురా పుల్లాయ్ అని మొన్నటిదాకా ఎవరైనా ప్రశ్నించారా అయ్యవారిని?
వేదాలు లేవు, రామాయణ భాగవత భారతాది పురాణేతిహాసాలు అన్నీ కాల్పనిక మన్నారు. మరి వాదనకు అనుకూలించిందని, అదే భారతంలోని భగవద్గీత శ్లోకాలు వాడుకొని కుల ప్రస్తావన ఎందుకు చేసావోయ్ పుల్లాయ్ అని మొన్నటిదాకా ఎవరైనా అడిగారా అయ్యవారిని?
కులమతాల పట్టింపులు లేవన్నారు. నేనో మానవతావాదిని అని చెప్పుకున్నారు. తమరి ఐ.డి.తో మోసపూరితంగావ్యవహరించారని తమరు చెప్పినవారి మీద కేసు పెట్టటానికి మాత్రం 'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ' యాక్టు ఎందుకు గుర్తుకువచ్చింది? వేరే అభియోగం ఎందుకు గుర్తుకురాలేదోయ్ పుల్లాయ్ అని అడగలేదే!
అయ్యవారికి అవసరమైన తెలివితేటలు ఎన్ని ఉన్నాయోకానీ, అక్కర్లేని అక్కసు చాలా ఉంది. అది మొన్నమధ్య ఆయన పెట్టిన ఓ కామెంటుతో తెలిసిపోయింది. దాదాపు సంవత్సరకాలంపైగా నేను వ్రాస్తున్న వ్యాసాలు, కవితలు ఆయనకు ఒక్కసారిగా చచ్చువిగా, పుచ్చువిగా కనిపించాయట. మరి ఆయన వ్రాసాననుకున్న కవిత్వాన్ని విమర్శించారని భాస్కర్ గారి గురించి ఆయన ఏం చెప్పారో చూడండి.
' ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు. చాలా ఉద్దాత్తరూపుడు. ఉదారస్వభావుడూ. యోగి. ఋషి. పల్నాటి వీరుడు. వేదసంహితుడు. ఇంకా ఎన్నెన్నో.
కులమతాల పట్టింపులనేవే లేవనే పెద్దమనిషి చూడండి పైన ఏమన్నారో! తాను దళితుడు కాబట్టి, తాను కవిత్వంపేరుతో వ్రాసారు కాబట్టి అది కవిత్వమనే అనాలిట! అది కవిత్వం కాదని భాస్కర్ అన్నందుకు ఎలా విరుచుకుపడ్డారో! ఎంత విచిత్రం. చివారఖరుకు, తను వ్రాసినవాటికి గుర్తింపు కోసం, మెప్పుదల కోసం కూడ ఈ పెద్దమనిషికి కులం కావాల్సివచ్చింది. పైకి మాత్రం మానవతావాది.
అయ్యవారి ద్వంద్వ వైఖరి పంచాయితీలో పెద్దరాయ్డుగారు ఇంకా చాలానే విడమర్చి చెప్పారు. అదీ చదువుకోండి, ఈయన ఎంత పెద్ద హిపోక్రాటో తెలుస్తుంది.
Friday, June 26, 2009
ద్వంద్వప్రవృత్తి - అయ్యవారి బెకబెకలు
Posted by
కొండముది సాయికిరణ్ కుమార్
at
8:19 PM
Subscribe to:
Post Comments (Atom)





4 comments:
మీమీదో , కేస్ కు రెడీ అవ్వండి :))
Well Said Sai garu.
పంచాయితీ లొ అంత క్లియర్ గా గడ్డి పెట్టినా.. తొలు మందానికి బుద్ది రాదుగా?
giri
please visit http://dhoommachara.blogspot.com for my new post
Post a Comment
Comments