Friday, June 26, 2009

అట్రాసిటీ కేసులు

మన రాజ్యాంగం కొందరికి ప్రసాదించిన కొన్ని విశేషహక్కులు ఎలా దురుపయోగమౌతున్నాయో, ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. జరిగిన ఆ రెండు సంఘటనలు స్త్రీలపై అత్యాచారానికి సంబంధించినవి కావటం ఓ విశేషమైతే, దురుపయోగం చేయటానికి ప్రయత్నించింది కూడా మహిళలే కావటం మరో విశేషం.

ముందుగా చెప్పుకోవాల్సిన సంఘటన... బాలీవుడ్ నటుడు షైని అహూజా తన ఇంటి పనిపిల్లను బలాత్కారం చేయటం. పరీక్షలు జరిపిన సంస్థలు ఈ ఘటనను నిర్ధారించాయి. పోలీసులు కేసు విచారిస్తున్నారు. కానీ విచిత్రమేమిటంటే, ఒక స్త్రీ అయి ఉండి, షైనీ అహుజా భార్య మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు నిజంగా తోటి స్త్రీలకు అవమానకరం.

'ఈమధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా మగవారిని బలాత్కారం చేస్తున్నారని' ఆవిడ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యకు మద్దతు తెలుపుతున్నట్లుగా, షైని అహుజా ఇంటి మరో పనిమనిషి, బలత్కారానికి గురైనట్లుగా చెప్పబడిన పనిమనిషికి షైనీ మీద మోజు ఉన్నదని చెప్పటం కూడా జరిగింది.

ఇవన్నీ చూస్తుంటే, జరిగిన సంఘటనకు మసిపూసి మారేడుకాయ చేయాలనే సంకల్పంతో ఈ 'మహిళలే' పావులు కదుపుతున్నట్లు స్పష్టమౌతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న మాటలని మరోసారి ఋజువు చేస్తున్నారు.

ఇక రెండో సంఘటన. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ లో నలుగురైదుగు పోలీసులు తనను సామూహిక బలాత్కారం చేసారని ఓ మహిళ సంచలన వ్యాఖ్య చేసింది. దరిమిలా, ఆ స్టేషనుపై ప్రజలు దాడి చేయటం, ఆ పోలీసులను, ఎస్.హెచ్.ఒ.ను సస్పెండు చేయటం, కేసును క్రైం బ్రాంచ్ కు అప్పగించటం కూడా జరిగింది.


ఇంతాచేసి, ఆ మహిళ బలాత్కారం చేసిన వ్యక్తులను గుర్తించలేకపోయింది. క్రైం బ్రాంచ్ నిర్వహించిన పెరేడ్ లో అసలు ఆ స్టేషనుకే సంబంధంలేని ఎవరో కానిస్టెబుల్ ను ఒక్కడిని గుర్తుపట్టిందట! అలానే, సంఘటన పోలీసు స్టేషనులో ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేకపోయింది.

సరే, ఆ విషయాలు పక్కన బెడదాం. ఆమెపై అఘాయిత్యం జరిగినట్లుగా కనీసమైన ఆనవాళ్ళు లేవని వైద్యులు నిర్ధారించటం ఓ విశేషం కాగా, ఆవిడ ముందు చేసిన కంప్లైంటులో భర్త పేరు ఓ విధంగాను, క్రైం బ్రాంచ్ విచారణలో మరోపేరు చెప్పటం మరో విశేషం. స్టేషనులోని సి.సి. కెమేరాలో కూడా ఈమె దాఖలాలే లేవట!

బహుశా ఇప్పుడు పోలీసులు ఈ మహిళలపై అట్రాసిటీ కేసులు వేయాలేమో?

0 comments:

Post a Comment

Comments