ఎవరో ఏదో బ్లాగులో ఈయన బ్లాగు లింకు తనదిగా ఇచ్చి తన కామెంటు పెట్టారట. రిజర్వేషనులని ప్రస్తావించి, ఈయన కులాన్ని ఎత్తి చూపించారుట. కడుపు మండిందట. కేసు పెడతారట! ఆయన ఎక్కడ ఉన్నా, ఈ దేశానికి రాకపోరా, అరెస్టు చేయించలేనా అన్న ధీమా! So what?
ఈ దేశంలో మహాత్మాగాంధిని అమ్మనాబూతులు తిట్టిన ఓ రాష్ట్ర దళిత ముఖ్యమంత్రి ఈ అయ్యవారికి ఆదర్శం! అవును. మహాత్మాగాంధికే దిక్కు లేదు, అది కూడా కేంద్రంలో కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో ఎంతమందిని ఎంతకాలం ఇలా వేధించగలమన్న ధీమాతో వీళ్ళు ఉంటారో?
ఆశ్చర్యమైతే లేదు కానీ, ఏవగింపు మాత్రం కలుగుతుంది. అందులోనూ, ఇంత చదువుకున్నవాళ్ళని ఇలా చూసినప్పుడు, ఇంతవరకూ వారిపై ఉన్న వీసమెత్తు గౌరవాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నప్పుడు, నిజంగానే ఛీదర పుడుతుంది.
సరే ఈ పిడకల వేట పక్కన పెట్టి, మాయావతి మాటతూలుడు గమనిద్దాం. హరిజన గిరిజనులతో కలిసిన తర్వాత మహాత్మా గాంధి ఇంటికి వెళ్ళి చేతులు కడుక్కునేవాడట! మహాత్మాగాంధీ అంటే, ఎవరో ములాయంసింగునో, అద్వానినో, సోనియానో భావించి ఈ మాయావతి తమ నోటి తీట బానే వదిలించుకుంది. కానీ, గాంధీని మహాత్ముడని ఎందుకు అన్నారు? అంబేద్కరును ఎందుకు అనలేదు అని ఒక్కసారైనా ఆవిడ ఆలోచించి ఉంటే, ఇలా నోరు పారేసుకునేది కాదు.
ఆ రోజుల్లోనే, అగ్రకులంలో పుట్టినా, కుల మత కట్టుబాట్లను పక్కకు పెట్టి, హరిజన గిరిజనులకు గుళ్ళల్లో ప్రవేశానికి పాటుపడ్డాడు గాంధి. ఈరోజుల్లో ఇదేమంత గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆ రోజుల్లో ఇది నిజమైన సాహసమే. ఎందుకంటే, కుల బహిష్కార శిక్ష కూడా విధింపబడే అవకాశమున్న సాహసం అది.
రౌండు టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా, బ్రిటీషు సామ్రాజ్యవాద దురహంకారానికి బలౌతున్న సామాన్య భారతీయుడుని ప్రతిబింబిస్తూ కొల్లాయి మాత్రమే కట్టుకున్నాడు. అలానే, స్వాతంత్ర్యపోరాటంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్ళాడో, చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. అదీ గాంధీ గొప్పదనం. అందుకే మహాత్ముడయ్యాడు.
మరి అంబేద్కర్ చేసిందేమిటి? హిందూ మతంలో కుల దురహంకారానికి బలౌతున్నానంటూ బౌద్ధ మతం స్వీకరించాడు. గాంధీలా అదే మతంలో ఉంటూ, మతభావాలను మార్చాలనే ప్రయత్నం చేయలేదు. కాబట్టి, ఓ పలాయనవాదిగానే ఆయన ప్రతిబింబిస్తాడు.
సరే, స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారైనా జైలుకు వెళ్ళిన చరిత్ర అంబేద్కర్ కు ఉందా? నిజానికి, విభజించి పాలించు అనే బ్రిటీషు సిద్ధాంతానికి అంబేద్కర్ చేయూతనందించి, అదే అభిప్రాయాన్ని రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రకటించాడు కానీ, దేశ స్వాతంత్ర్యం గురించి ఏనాడూ పోరాడలేదు.
దాదాపు మూడు వందల మంది దాకా సభ్యులున్న రాజ్యాంగసభలో ఒకే ఒక్క 'డ్రాఫ్టింగ్ కమిటీ'కి ఆయన ఛైర్మన్ గా వ్యవహరించాడు. అది కూడా, రాజ్యాంగసభ దాదాపు యాభై శాతం తన పని ముగించిన తర్వాత.
రిజర్వేషనుల పరంగా ఈరోజు చాలామంది అంబేద్కర్ తమనేదో ఉద్ధరించాడని నెత్తిన పెట్టుకుంటారు. మరికొంతమంది ఆయనపై అనవసరంగా నోరు కూడా పారేసుకుంటారు. నిజానికి, ఈ రిజర్వేషనుల ప్రతిపాదన చేసింది అంబేద్కర్ కాదు. వల్లభ్ భాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఇతర నేతలు. హరిజన, గిరిజనుల, తదితర వెనుకబడిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగ సభలో ఏర్పాటు చేయబడిన కమిటీలకు వారు చైర్మన్లుగా వ్యవహరించి రిజర్వేషనుల ప్రతిపాదన చేసారు.
ఏదేమైనా, పై విషయాలు తెలుసుకున్న తర్వాత గాంధీ ఎంతటి మహాత్ముడనేది అర్ధమైనా కాకపోయినా, మాయావతి ఎంత మూర్ఖురాలో అర్ధమౌతుంది। పుట్టినరోజు పండగల జరుపుకుంటూ 50-60 కిలోల కేకు కోసి పంచుకునే మాయావతికి మహాత్ముని విలువలు తెలుస్తాయనుకోవటం మన తప్పు.
PS : అయ్యా నాకు 'కత్తిలాంటి' అనేది ఊతపదం. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో 'కత్తి' అన్న పదం వాడాలంటే భయంవేసి, అది ఈ టపా శీర్షిక నుంచి తీసేలోపే 'జల్లెడ'లో వచ్చింది. అందుకు 'కత్తి'వారు నన్ను క్షమించగలరు.
Saturday, June 20, 2009
మాయావతి మూర్ఖత్వం
Posted by
కొండముది సాయికిరణ్ కుమార్
at
10:42 PM
Subscribe to:
Post Comments (Atom)





11 comments:
మాయావతి మూర్ఖత్వం ఏమోకానీ మీ మూర్ఖత్వం మాత్రం బయట పెట్టుకున్నారు. గాంధీ మహాత్ముడే. అది చెప్పటానికి మీరు అంబేద్కర్‌ని తిట్టక్కర్లేదు. వాళ్ళకున్న అవకాశాలను బాట్టి, పెరిగిన పరిస్థితులను బట్టి ఇద్దరూ వేర్వేరు రకాలుగా సేవ చేశారు. సేవ ఒకలానే ఉండాలి అనే దిక్కుమాలిన ప్రతిపాదనలు మానేయండి. ఇంకా విద్వేషాలు రగల్చకండి.
మాయావతికున్న వాచాలత తెలిసిందే కదా...
సరే అదలా వుంచండి ఎం.వి.ఆర్. శాస్త్రి గారు మన మహాత్ముడు అనే పుస్తకంలో గాంధీగారిలో మనకెవ్వరికీ ఇంతవరకూ తెలియని పార్శ్వం వుందని చెప్పడానికి ప్రయత్నించారు. ఒకసారి మీరు చదివి సమీక్షించగలరా?
కేసు పెడతారట! ఆయన ఎక్కడ ఉన్నా, ఈ దేశానికి రాకపోరా, అరెస్టు చేయించలేనా అన్న ధీమా!
Still laughing at this :)
అయ్యా అనానిమస్ గారు. నేను అంబేద్కర్ ను ఎక్కడ తిట్టాను. ఆయనకు మహాత్మునికి ఉన్న తేడాల గురించే మాట్లాడాను. వారికున్న అవకాశాలను బట్టి వారు వేరువేరు సేవలు చేసారా? మహాత్ముని సేవలు నాకు తెలుసు. అంబేద్కర్ చేసిన సేవల గురించి మీరేమైనా వ్రాస్తే తెలుసుకుంటాను. ఆ రోజుల్లో చదువులు త్యాగం చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారు చాలామంది ఉన్నారు. డిగ్రీలపైన డిగ్రీలు చదవగలిగిన తీరిక చేసుకున్నది ఒక్క అంబేద్కరే అంటే మీకు ఆశ్చర్యం కలగదేమో! మీ దిక్కుమాలిన ప్రతిపాదనలు ఏవైనా ఉంటే చెప్పండి, కాసేపు నవ్వుకుంటాను.
బై ద వే నేనో సామాన్యుడిని. నా ఈ రాతల వల్ల విద్వేషాలు రగులుకుంటున్నాయని నేను అనుకోను. కానీ, బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మహాత్ముడి గురించి అనాల్సిన మాటలేనా అవి?
LOL..
కత్తిలాంటి post.
మీకు మాయావతి ఏ వర్గానికి చెందినదో తెలుసా? తెలిసే ఇలా వ్రాస్తున్నారా? మేము పెట్టబోయే S.C./S.T కేసులలో మీ పేరుకూడా ఇరికించమంటారా? మీకు తెలియకొపోతే మళ్లీ చెబ్తున్నాం, ఏ పదవిలో వున్నా, ఎంత చదువుకొన్నా నోరు పడేసుకొంటానికి మాకు రాజ్యాంగం హక్కు నిచ్చింది. అదే రాజ్యాంగం, ఇంకేవరైనా వాళ్ల వాళ్ల, అభిప్రాయాలు మాకు నచ్చకుండా, వ్యక్తపరిస్తే S.C./S.T కేసులు పెట్టుకోవచ్చు అని కూడా, హక్కు నిచ్చింది. అందుకే మా అంబేద్కర్, గాంధి కంటే గొప్పే ఎవరు ఎమి అన్నా.
P.S. ఇది సెంట్రల్ యునివర్సిటీ లో, రిజర్వేషన్ తో చదువుకొన్న వాళ్లను, అందునా "ఫలానా"(??) ఇంటి పేరు ఉన్న వాళ్లను, కించ పరచటానికి వ్రాసింది కాదు. :))
భలే చెప్పారు.
నాకు గాంధీ గారు నచ్చినా నచ్చక పోయినా ఆయన సిధ్ధాంతాలు మాత్రం నచ్చుతాయి.
అయినా ఒక మాయావతి అని ఎముంది....
అగ్రవర్ణాలుగా గుర్తించబడిన వారిని తిట్టడం, చీల్చి చెండాడం అనేది తమ జన్మ హక్కు, అలా చేస్తేనే తమ సమానత్వ ఉద్యమం సాగించినట్లు అనుకుంటున్న జనాభా నుండి ఇంతకన్నా ఎమి ఆశించగలం.
Hello Sai Garu,
You surprised me when you said, "Reservations" as an idea floated by Patel and Rajendraprasad. I hope atleast now the 'un-reserved' category people stop blaming Ambedkar for their plight of not getting seats even after haing 'merit'.
You may not be knowing what the affect of Ambedkar on Dalits and their self respect movements. It might be helpful if you can bother to visit Madigavada/malapalle in your village to understand how they feel about Ambedkar and what his conntribution towards their lives.
Naresh
Hello Naresh Garu - Thank you for your comments. Let me reiterate that I respect Dr. Ambedkar and some of his view points.
However, I honestly believe that leaders like Sardar Patel, Rajendra Prasad etc., who were Chairing various committees and sub-committees in the Constituent Assembly were not given due credit for recommending reservations to various minorities. Instead, only one person is given full credit, that too as the father of Indian Constitution. There were around 300+ members, who worked hard in making the Constitution. Babu Rajendra Prasad was the Chairman of the Constituent Assembly. Ambedkar's involvement started only after half-way through the session. Still he gets away with all the credit and we forget Babu Rajendra Prasad!!
All this information is available in some of the gov.in website (related to Parliament). You may re-check.
Anyways, thank you for a reasonable comment than just calling me like anti -dalit etc.
central university lO, reservation category lO chaduvukunna, "phalAnA" inTi pEru lEni,anonymous gAru bhalE correct gA cheppAru.
"daLita" tag lEni, E kulAnnainA, vAri bhavanalanainA, ishTAnusAramgA vimarsistAm... E mAtram ehtics lEkunDA, nOTikochchindallA pElutAm... brAmhaNulanaitE, kulampEritti marI dUshistAm.. .. Em pIkkunTArO, pIkkOnDi. adE mammalnEmainA anTE, SC/ST atrocity act kinda case peDatAm ani black mail chEstAm...
idI intalEsi chaduvukunna vALLu mATlADE tIru. btw, samskAram anE padam, SC/ST atrocity act tIsukochchinappuDE dictionary lOnchi pIkESArA, lEka, asalu A padam dictionary lO eppuDU lEdA?
బాగా రాశారు మేష్టారు !
Post a Comment
Comments